తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా చెంగం సమీప గ్రామంలో ఓ 15 ఏళ్ల బాలిక అబార్షన్ మాత్ర వేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఎస్.మురుగన్ (27) అనే వ్యక్తి వల్ల బాలిక గర్భం దాల్చింది. అతడు తన స్నేహితుడు ప్రభు (27)కి విషయం చెప్పి, అబార్షన్ మాత్ర సంపాదించాడు.
బాలిక ఆ మాత్ర వేసుకోగానే స్పృహ తప్పి పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించింది. నిందితులపై పోలీసులు పోక్సో కేసు పెట్టారు.