వినియోగదారుల ప్రైవసీ విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు అబార్షన్ క్లినిక్‌లు, గృహ హింస షెల్టర్స్, ప్రైవసీ కోరుకునే ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు వారి లోకేషన్ హిస్టరీనీ తొలగిస్తామని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెన్ ఫిట్జ్‌పాట్రిక్ వెల్లడించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.