చిత్తూరు: తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధాన్ని శుక్రవారం నుంచి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని బి. కొత్తకోట నగర పంచాయతీ కమిషనరు నరసింహప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉల్లంఘించిన వ్యాపారులకు రూ. 2, 500 నుంచి రూ. 5, 000 వరకు, వ్యక్తిగత అవసరాల కోసం ప్లాస్టిక్ ఉపయోగిస్తే రూ. 250 నుంచి రూ. 500 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.