ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. ఏపీ స్కూళ్లలో అమలుచేస్తున్న ఇంగ్లీషు మీడియంతో ఇబ్బందులు తప్పవన్నారు. భవిష్యత్తులో తెలుగు, ఇంగ్లీషులలో ఏ భాషా సరిగ్గా రాక అవస్థలు పడతారన్నారు.