యూపీలోని ఆగ్రాలో ధనిరామ్ అనే వ్యక్తి నవజాత కుమార్తె మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు శనివారం నిరసన చేపట్టాడు. తనపైనా, గర్భంతో ఉన్న తన భార్యపైనా గుడ్డూ, రామస్వామి అనే వ్యక్తులు దాడి చేశారన్నారు.
తన భార్యను ఆసుపత్రిలో చేర్పించగా మృత శిశువును ప్రసవించిందన్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారని వాపోయాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారి స్పందించి విచారణకు ఆదేశించారు.