మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన రెబల్ నేత ఏక్నాథ్ శంబాజీ షిండే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రేపు బల పరీక్షకు సిద్ధమయ్యారు.4న షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు తనకు మద్దతిస్తున్న నేతలతో షిండే మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో పాటు శివసేన నేతలతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు.