పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు . రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ , రాష్ట్ర ముఖ్యమంత్రి వై . యస్ . జగన్ మోహన్ రెడ్డి , రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ భద్రత ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa