ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 03:41 PM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకని ఆ మహాయోధుడి విగ్రహ ఆవిష్కరణకు భీమవరం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వేదికపై ఉన్న మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవికి, ఇతర పెద్దలు, మిత్రులకు సభ అధ్యక్షుడి హోదాలో సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. సభకు వచ్చిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలకు, అందరికీ హృదయపూర్వకంగా పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని సీఎం జగన్ తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్య్ర సమరంలో, జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 వరకు చూస్తే దాదాపు 190 సంవత్సరాలు తిరిగి చూస్తే పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధ చేస్తూనే అడుగులు ముందుకువేసింది. లక్షల మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి భారతదేశం. అటువంటి మహాత్యాగ మూర్తుల్లో మనగడ్డ మీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరు అయినా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులు, పోరాట యోధుల్లో మహా అగ్నికణం.. ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. అడవిలో కూడా అగ్గిపుట్టించిన ఆ యోధుడు.. సామాజిక ఐకమత్యం అవసరాలను తెలియజెప్పాడు. భావాల పరంగా ఎన్నడూ కూడా మరణంలేని ఓ విప్లవ వీరుడు.. ఆ అల్లూరిని స్మరించుకునేందుకు 125వ జయంతి సందర్భంగా మనమంతా ప్రధానమంత్రి సమక్షంలో సమావేశమయ్యాం అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com