మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రామ్‌ప్యారీ షహరియాలో ఓ భూవివాదంలో 38 ఏళ్ల గిరిజన మహిళకు కొందరు దుండగులు నిప్పంటించారు. బాధితురాలిని రాంప్యారి సహారియాగా గుర్తించారు. తమపై దాడి చేసిన వారు ఓబీసీ వర్గానికి చెందినట్లుగా బాధితురాలి భర్త తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa