ఈనెల 8,9 తేదీలలో గుంటూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ముఖ్యనేతల సమావేశం జరిగింది.సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..... ప్లీనరీ సమావేశాలను పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని వివరించారు. ప్లీనరీ నిర్వహణ కమిటీలకు సంబంధించి నియమితులైన సీనియర్ నేతలందరూ ప్లీనరీ నిర్వహణలో భాగస్వాములై పనిచేయాలని కోరారు. ఆయా కమిటీలకు సంబంధించి సభ్యులతో సమావేశమై వారి భాగస్వామ్యంతో వారికి అప్పగించిన బాధ్యతలను చూడాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ,జిల్లా స్దాయి ప్లీనరీలు నిర్వహించుకున్నామని తెలియచేశారు. ఇదే ఉత్సాహాన్ని ప్లీనరీ సమావేశాలలో కూడా చూపించాలని కోరారు.