శ్రీలంక మహిళల జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. సోమవారం పల్లెకెలె వేదికగా జరిగిన రెండో వన్డే లో భారత్ ఏకంగా 10 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగలకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 25.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది.