శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. భారత ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలీ వర్మ 174 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించారు. మహిళల క్రికెట్లో లక్ష్యఛేదనలో వికెట్ పడకుండా ఛేదించిన అత్యధిక టార్గెట్ ఇదే.
ఈ మ్యాచ్లో స్మృతి 94, షెఫాలీ 71 రన్స్ చేశారు. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండాగానే 2-0 తేడాతో సిరీస్ టీమిండియా కైవసం చేసుకుంది.