ప్రభుత్వ శాఖలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న ముఠాలోని ఇద్ధర్ని అనంతపురం 2 టౌన్ పోలీసులు అరెస్టు చేసారు. ముఠా నుండీ ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఆర్డర్ కాఫీల తరహాలో ఉన్న 4 నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్ కాఫీలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి ఎవరూ వంచనకు గురి కారాదని... ప్రభుత్వం ఇచ్చే ఏ ఉద్యోగాలైన నియమ నిబంధనలు, నోటిఫికేషన్లు, తదితరాలన్నింటిని పాటించి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని డీఎస్పీ పేర్కొన్నారు.