ఇళ్లలో కాఫీ చేశాక ఫీల్టర్ చేసి పొడిని బయట పారేస్తుంటారు. అయితే, వాడేసిన కాఫీ పొడితో కూడా మనకు బొలెడు ప్రయోజనాలున్నాయి. గదిలో కానీ, ఫ్రిజ్‌లో కానీ చెడూ వాసనలు వస్తుంటే అక్కడ వాడేసిన కాపీ పొడిని ఉంచితే కొంతసేపటి తర్వాత ఆ వాసనలు రావు. ఇంట్లో పురుగులు, కీటగాలు, బొద్దింకల వంటివి ఉన్నచోట కాఫీ పొడి పెడితే అవి పారిపోతాయి. అయితే దీన్ని ఎక్కడ ఉంచినా కొన్ని గంటల్లోనే తీసేయాలని మర్చిపోవద్దు.