ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 01:51 PM

గుంటూరు, సత్తెనపల్లి: పాఠశాల విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నందిగామ ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో దూరమైన బడికి మా పిల్లలను పంపించం అంటూ మంగళవారం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com