అమర్నాథ్ యాత్రను మంగళవారం తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాలయ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ నుంచి వెళ్లేవారికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ లోని హిమాలయాల్లో దాదాపు 3880 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో మంచు లింగం ఉంది. ఇప్పటివరకు 72 వేల మంది హిమలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.