ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తెలంగాణలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా తన ఇంటి దగ్గర నిఘా పెట్టినందుకు ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ను రఘురామరాజు అనుచరులు అదుపులోకి తీసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదు చేసారు.