స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు చివరిలో మాత్రం నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 53,134 వద్ద ముగిసింది. నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 15,810 వద్ద జారుకుంది
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.92%), సన్ ఫార్మా (0.90%), రిలయన్స్ (0.80%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.73%), విప్రో (-1.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.20%), L&T (-1.12%), మారుతీ (-1.10%).