--- శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, పొడుగ్గా ఉండే వారిలో ఊపిరితిత్తులు, గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువంట.
--- 2012లో ఒక విమాన ప్రయాణికుడు 60 చొక్కాలు, తొమ్మిది జతల ప్యాంట్లను వేసుకుని పదకొండున్నర గంటల విమాన ప్రయాణం చేసాడంట. ఎందుకు ఇలా చేసాడంటే, ఎక్స్ట్రా బ్యాగేజి పై పన్ను కట్టకుండా ఉండడానికి. చాలా తెలివైన నిర్ణయం కదా...!
--- నరాలను ఉత్తేజపరచడానికి బొటనవేలిపై నోటితో బలంగా గాలి ఊదితే సరిపోతుంది.
--- ఎవరైనా, ఎపుడైనా రోజుకి సగటున ఆరు నిమిషాల పాటు న్యూస్ పేపర్ కానీ, ఏదో ఒక పుస్తకం కానీ చదివితే, ఫ్యూచర్ లో అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాక ఇలా చెయ్యటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపొందుతుంది.