ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద అర్హులైన వారికి రూ.10 వేలు అందజేస్తారు. ఈ నగదు ఆటో, టాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్-కమ్-ఓనర్లకు ఇవ్వబడుతుంది. సొంత వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ నెల 13న ఖాతాలో జమ చేస్తామన్నారు. అర్హులైన వారు ఈ నెల 7వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కొత్త దరఖాస్తుదారులు వివరాల కోసం సచివాలయాలను సంప్రదించాలి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa