ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ చరిత్రలోనే మన రూపాయి తొలిసారిగా ఇంతటి పతనం

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 03:16 AM

భారత దేశం పురోగతి సాధిస్తోందని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఢంకా భజాయిస్తున్నా మన దేశ రూపాయి విలువ మాత్రం రోజురోజుకు దిగజారుతోంది. అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజు రోజుకూ మరింతగా పడిపోతోంది. దేశ చరిత్రలోనే అతి తక్కువగా మంగళవారం డాలర్ కు రూ.79.36 పైసలుకు రూపాయి విలువ పతనమైంది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో డాలర్లకు డిమాండ్ బాగా పెరిగిందని.. ఇది రూపాయి బలహీనం కావడానికి కారణమైందని ఆర్థిక వేత్త అనుజ్ చౌదరి వెల్లడించారు. మన దేశ పారిశ్రామిక, ఇతర అభివృద్ధి గణాంకాలు కూడా బలహీనంగా ఉండటంతో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్టు అంచనా వేశారు.


ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి రూ.78.95 పైసల వద్ద ముగిసింది. అయితే మంగళవారం ఉదయం అంతకన్నా దిగువన రూ.79.02 పైసల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రా డేలో 79.02 పైసల వరకు పెరిగినా.. తర్వాత 79.38 పైసల దాకా కూడా పడిపోయింది. చివరన 79.36 పైసల వద్ద ముగిసింది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే 41పైసలు తగ్గిపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com