ఆటలో గెలుపు ఎంతో ముఖ్యం. అలాంటి ఆటలో గెలిచే అవకాశమున్నా ఇతరుల కారణంగా తాము అకారణంగా ఓడితే ఆ బాధ ఏమిటో ఓడిన వారికే తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ ఏడాది ఏప్రిల్ లో సింధు బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్ షిప్ టోర్నీలో ఆడింది. అయితే, ఆ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. సింధు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందంటూ ఆమె ప్రత్యర్థి అకానే యమగూచికి రిఫరీ ఓ పాయింట్ కేటాయించాడు. యమగూచి సిద్ధంగా లేదని భావించి సర్వీస్ చేసేందుకు సమయం తీసుకున్నానని సింధు తన వాదన వినిపించింది. కానీ ఆ రిఫరీ వినిపించుకోలేదు. ఆ తర్వాత యమగూచి పుంజుకుని సింధుపై విజయం సాధించింది.
ఇదిలావుంటే బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఈ అంశంపై తాజాగా స్పందించింది. ఆ మ్యాచ్ లో రిఫరీ చేసింది తప్పేనని కమిటీ అంగీకరించింది. పీవీ సింధుకు క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన చేసింది. అది మానవ తప్పిదమేనని, కానీ ఇప్పుడు ఏంచేయలేమని విచారం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పీవీ సింధుకు బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ లేఖ రాశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa