ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తండ్రి, కూతురు ఇద్దరు అరుదైన రికార్డు సృష్టించారు. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ, ఆయన కూతురు ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ కలిసి ఫైటర్ జెట్‌ను నడిపి రికార్డు సృష్టించారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతురుగా నిలిచారు.1989లో వైమానిక దళంలో చేరిన తన తండ్రి సంజయ్ శర్మ అడుగుజాడల్లోనే నడిచింది అనన్య శర్మ. వైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో చోటు సంపాదించింది.