ఈ ఏడాది వర్షాకాల సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయాత్తమైంది. జులై 19 నుంచి 23 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తాజాగా వెల్లడించింది. మరో వైపు ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ద్రౌపది ముర్ముకు వైసీపీ బహిరంగ మద్దతు తెలియజేసింది. టీడీపీ ఇంకా ఎటూ తేల్చలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa