యూపీలోని షహబాద్కు చెందిన కరీనా అనే మహిళ జులై 2న లక్నోలో వింత శిశువుకు జన్మనిచ్చింది. సిజేరియన్ చేసిన తర్వాత నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న ఆడ శిశువును చూసి అంతా అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ శిశువును చూసేందుకు తరలి వస్తున్నారు. దేవతకు ప్రతిరూపమని చెప్పుకుంటున్నారు. అయితే కవలల్లో మరో బిడ్డ ఎదుగుదల లేకే శిశువు అలా పుట్టిందని వైద్యులు చెబుతున్నారు.