కోవిడ్ 19 పుట్టినిల్లు అయినా చైనా లో మళ్ళీ కలకలం సృష్టిస్తోంది. కరోనా నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టారు. జియాన్ నగరంలో ఏడు రోజుల తాత్కాలిక నియంత్రణ చర్యలను అమలు చేయనున్నామని నగర అధికారి జాంగ్ జుడాంగ్ చెప్పారు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో అధికంగా ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ కేసులే. ఈ కేసుల వ్యాప్తిని నివారించడానికి పురాతన చైనీస్ నగరమైన జియాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు.