టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీమంత్రి అమరనాథరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ తొలగింపుపై పెద్దపంజాని మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట మాజీమంత్రి, జిల్లా టీడీపీ నాయకులు నాని, కోదండ యాదవ్ తదితరులతో కలసి మండల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. బ్యానర్ తొలగింపు హేయమైన చర్యగా పేర్కొన్నారు.