గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. నేడు కూడా లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, హెచ్ యుఎల్ సంస్థ షేర్లు లాభాలను చూశాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి. మొత్తానికి నేడు 616 పాయింట్లతో సెన్సెక్స్, 178 పాయింట్లతో నిఫ్టీ లాభాలతో ముగిశాయి.