నాంపల్లిలో సిబిఐ బ్యాలెన్స్ షీట్లో చూపిన 43 వేల కోట్ల నుండి నయ్యాపైసా తెచ్చి ఇవ్వలేడు కదా అంటూ టీడీపీ నాయకులూ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగంగా ట్వీట్ చేసారు. ఉందులో భాగంగా ... అప్పుతెచ్చినప్పుడు కట్టాలి కదా. కట్టాలి అంటే ఆయన ఇంట్లో అడగలేడు కదా. బాదుడే కదా మార్గం. ఆయన పంచే దాన కర్ణ ఫోజులు అందరికీ తెలియాలంటే 280 కోట్లు తగలెట్టాలి కదా. అప్పులు తెచ్చి జీతాలు & భత్యాలకంటే ముందుగా వేసే బిస్కట్లకు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? తీసుకొన్న అప్పులకు నిత్యం ఆత్మహత్యలు చేసుకొనే జనాల వార్తలు చూస్తున్నాం. ప్రభుత్వాలు అలా చేసుకోవు. భరించే జనం వున్నప్పుడు మరిన్ని బిస్కట్లకు మరిన్ని అప్పులు తెస్తారు. లంకలా మారకుండా వుండాలంటే అప్పులు కట్టాలి. వడ్డీలతో సహా కట్టాలి అంటే బాదుడు జనం భరించాల్సిందే. ఏ పన్నులు ఏ వృత్తి మీద వేసినా.. జనం మీద పడుతుంది. బతుకులు మరింత దుర్భరంగా మారుతుంది. ఒక్కో తలకు ఇంత అప్పు అని మీడియా చెప్పినప్పుడు ఆ ఎవడో కదా కట్టేది అనుకొంటారు. రాష్ట్రం అప్పులు ఒక్కో కుటుంబానికి పంచితే ఆంధ్రాలో సరాసరి ఒక్కో కుటుంబానికి పదిలక్షల అప్పు భరించాల్సి వస్తుంది అనే విషయం కూడా అర్థం కాక జనం వున్నారు. ఇలా బాధినప్పుడు ప్రతి కుటుంబం సరాసరి పది లక్షలకు పైగా ప్రభుత్వాల అప్పులు వడ్డీతో సహా తీర్చక తప్పదు అంటూ అధికార టీడీపీ పేజీ లో ట్వీట్ చేసారు .