స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 617 పాయింట్లు లాభపడి 53,751 వద్ద ముగిసింది. నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 15,990 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
బజాజ్ ఫిన్ సర్వ్ (4.54%), బజాజ్ ఫైనాన్స్ (4.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (4.01%), మారుతి (3.48%), ఏషియన్ పెయింట్స్ (3.45%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.63%), ఎన్టీపీసీ (-1.03%), రిలయన్స్ (-0.87%), L&T (-0.50%), టాటా స్టీల్ (-0.22%).