బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సాయంత్రం ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నఖ్వీ కేంద్ర మంత్రివర్గంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.పదవీకాలం బుధవారంతో ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారనే వాదనలు కూడా ఉన్నాయి.