ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించింది అని తెలిపారు.గతంలో స్పీకర్గా కోడెల శివప్రసాదరావుకు కూడా మద్దతిచ్చామని అయన తెలిపారు.ఢిల్లీలో చక్రం తిప్పే ఉద్దేశం తమకు లేదని సజ్జల తెలిపారు.