పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గురువారం రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను ఆయన వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చంఢీగఢ్ లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు ఢిల్లీ సీఎం, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. భగవంత్ మాన్ తన మొదటి భార్యకు ఆరేళ్ల క్రితం విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఆమె తమ ఇద్దరు పిల్లలతో అమెరికాలో ఉంటున్నారు.