బాపట్ల: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు నాగాంజనేయులు తెలిపారు.
గురువారం సాయంత్రం రేపల్లె మున్సిపల్ కమీషనర్ విజయ సారధికి కార్మికులతో కలసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా నాగాంజనేయులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పారన్నారు.