బనగానపల్లె మండలంలోని కటికవానికుంటకు చెందిన పిల్లి అనసూయ(45) అతిసార వ్యాధి లక్షణాలతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు గురువారం తెలిపారు. మూడు రోజుల నుంచి వాంతులు, విరోచనలు బాధపడుతుండేదన్నారు.
బుధవారం విరోచనలు అధికంకావడంతో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందిందని వివరించారు. కాగా గ్రామంలో అతిసార ప్రబలడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.