త్రిపురాంతకం: ఇటీవల ధాన్యం కొనుగోళ్లలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు.. జేసీ అభిషిక్త కిశోర్ విచారణలో బయటపడిన అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శుక్రవారం ఆదేశించారు.
దీనిలో భాగంగా తహశీల్దార్ కిరణ్ పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని నాగరాజు, గురవయ్య, విశ్వనాథపురం సొసైటీ సీఈవో, కంకణాలపల్లి వీహెచ్వోలపై ఎస్సై వెంకట సైదులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.