తిరుమలలో శుక్రవారం చిరుజల్లులు కురిశాయి. బుధవారం నుంచి తిరుమలలో చిరుజల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎండనే మాట లేకుండా పోయింది. అడపాదడపా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంది. శుక్రవారం వేకువజాము నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల్లో చాలామంది వృద్ధులు చలికి ఉండలేక తిరుగు ప్రయాణమయ్యారు.