సామాన్యులకు కేంద్రం గుడ్న్యూస్ అందించింది. వంటనూనెలపై లీటరుకు రూ.15 ధర తగ్గించాలని రిఫైనరీలకు, డీలర్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ తగ్గింపు వర్తింపు చేయాలని సూచించింది.
అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గాయి. మరోవైపు పామాయిల్ ఎగుమతిపై ఇండోనేషియా నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయాలతో దేశీయంగా వంటనూనెల ధరలు తగ్గాయి. వంటనూనెలపై చివరిగా 2022 మేలో ధరలు తగ్గాయి.