భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్) భారీగా తగ్గాయి. జూలై 1తో ముగిసిన వారానికి దేశంలోని విదేశీ మారక నిల్వలు 5.008 బిలియన్ డాలర్లు తగ్గి 588.314 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ పేర్కొంది. అంతక్రితం వారం ఫారెక్స్ నిల్వలు 2.734 బిలియన్ డాలర్లు పెరిగి 593.323 బిలియన్ డాలర్లకు చేరాయి. రూపాయి పతనానికి అడ్డుకట్టవేసేందుకు ఫారెక్స్ నిల్వలు వినియోగించనున్నట్లు ఈ మధ్యనే ఆర్బీఐ ప్రకటించింది.