ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు అలర్ట్: యూటీఎస్ యాప్ బంద్, రైల్ వన్ యాప్ కీలకం

national |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 04:25 PM

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ యాప్ పూర్తిగా నిలిచిపోనుంది. ప్రస్తుతం అన్ రిజర్వ్‌డ్, జనరల్, ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం ఉపయోగించే ఈ యాప్ సేవలు ఇక అందుబాటులో ఉండవు. రైల్వేశాఖ ఈ సేవలను రైల్ వన్ యాప్‌లోకి మార్చుతోంది. ఇకపై రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్, సబర్బన్, ప్లాట్‌ఫామ్ టికెట్లన్నీ రైల్ వన్ యాప్‌లోనే బుక్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్ వన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వొచ్చు. యూటీఎస్ లేదా ఐఆర్‌సీటీసీ లాగిన్స్‌తోనూ లాగిన్ అయ్యే సౌకర్యం ఉంది. రైల్ వన్ యాప్‌లో టికెట్ బుకింగ్‌తో పాటు, రైలు లొకేషన్ ట్రాకింగ్, స్లీపర్ బెర్త్ బుకింగ్, రైల్ మదద్ ద్వారా ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ పేమెంట్స్‌పై 3% తగ్గింపు కూడా లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa