బక్రీద్ పండుగను పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఈద్గా అత్యంత సుందరంగా ముస్తాబైంది. ఎంపి మిథున్ రెడ్డి నిధుల నుంచి రూ. 18 లక్షలును ఇటీవల ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మంజూరు చేయించారు. ఈ నిధులతో ఈద్గాలో పెండింగ్ పనులను పూర్తి చేయించారు. ఈద్గా కు మంచి రంగులుతో ఆకర్షణీయంగా, సుందరంగా తీర్చిదిద్దారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఆదివారం జరగనున్న బక్రీద్ సామూహిక ప్రార్థనలకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఈద్గాకు వెళ్లే రహదారులలో జెండాల ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది పారిశుద్యపు చర్యలను పూర్తి చేశారు. ఈద్గా మైదానంలో వరుస లైన్లు, త్రాగునీటి వసతులును కల్పించి చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు. ఈద్గా అభివృద్ధికి సహకరించిన ఎంపీ మిథున్, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలకు మైనారిటీలు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నారు.