గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తాడని డాక్టర్ శరణ్య రెడ్డి తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు శస్త్రచికిత్సలునిర్వహించనున్నట్లు చెప్పారు.
శనివారం లక్ష్మీదేవి జ్ఞాపకార్ధం వారి కుమారులు, మానవతా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ శరణ్య రెడ్డి చేతుల మీదుగా 100 మంది గర్భిణీ మహిళలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు డి. వి. కొండారెడ్డి, హరిచంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి , నారాయణరెడ్డి, శంభురెడ్డి, అంగడి నాగేంద్ర, లాయర్ శ్రీనివాస్, రామమోహన్, కృష్ణ మూర్తి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.