రాజోలు మండల కేంద్రం రాజోలులో గోదావరి నది ఉరకలేస్తుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ధవళేశ్వరం వద్ద నుండి దిగువకు విడుదలవుతున్న నీరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజోలు పరిసర ప్రాంతాలలో గోదావరి నది ఉదృతంగా పయనిస్తుంది.
గోదావరి నీటి ప్రభావం పెరగడంతో దిగువ ప్రాంతాలవారు అప్రమత్తమవుతున్నారు. గోదావరి అందాలను పలువురు ప్రకృతి ప్రేమికులు తమ మొబైల్ ఫోన్లలో బంధిస్తున్నారు.