ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది.
మున్నేరు నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు కృష్ణాలో చేరుతుండగా అధిక వరద ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజీలోని ఎనిమిది గేట్లను ఎత్తివేశారు. 8,000 క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.