బుక్కరాయసముద్రం మండల పరిధిలో పలు కాలనీలలో ప్రమాదపు అంచుల్లో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. ఆదివారం రాఘవేంద్ర కాలనీ నుండి బోయకొట్టాళ్ళకు వెళ్లే దారిలో ఓ వాహనం కొద్దిపాటిలో విద్యుత్ ప్రమాదం నుండి బయటపడింది.
స్థానికులు గమనించి కట్టెలతో కొట్టి విద్యుత్ ప్రమాదం నుండి వాహనాన్ని తప్పించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.