తమిళనాడులో అన్నాడీఏంకే పార్టీలో ఆధిపత్య పోరు ముదిరింది. సోమవారం మాజీ సీఎంలు పళని స్వామి, పన్నీరు సెల్వం వర్గాలు చెన్నైలోని పార్టీ ఆఫీసు వద్ద బాహాబాహీకి దిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య కాసేపటిలో పార్టీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మరోవైపు నిబంధనలకు వ్యతిరేకంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారని పన్నీరుసెల్వం వేసిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది.