వైసీపీ ప్లీనరీ సభల్లో ఒక అనుకోని సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.. వేమూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ పార్టీ అభిమాని, వాలంటీర్ గా కూడా పనిచేస్తున్న దినేష్ పేవ్మెంట్ మీద నడుస్తూ ప్రమాదవశాత్తూ కాలు స్లిప్ అయ్యి బస్సుకింద పడి చనిపోవడం జరిగింది. దీనిపై స్పందించిన పార్టీ నాయకులూ మాట్లాడుతూ... ప్రాణాలు తిరిగి తేలేం కానీ, పార్టీ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందిస్తాం. వేమూరు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు, మంత్రి మేరుగ నాగార్జున ద్వారా రూ.5లక్షలు మా పార్టీ తరపున ఆ కుటుంబానికి అందజేస్తున్నాం అని తెలియజేసారు.