చంద్రబాబు నార్సిసిస్టిక్ పర్సనాల్టీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు అని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు.ఆయన మాట్లాడుతూ... నెగిటివ్ భావాలతో తీవ్రమైన మానసిక అలజడికి లోనైన వ్యక్తి. ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడు కాదు. రిటైర్ అయిపోతే ఆంధ్రరాష్ట్రానికి, ప్రజలకు మంచిదని భావిస్తున్నాం. చేతకానివాళ్లు, యుద్ధం చేయలేనివాళ్లు, ఎదురించలేనివాళ్లు గోబెల్స్ ప్రచారం ఎన్నుకుంటారు. చంద్రబాబు కూడా అదే కోవకు చెందినవాడు. పరాక్రమవంతులు, రణక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడగలిగేవాళ్లు మాత్రమే పోరాడి విజయం సాధిస్తారు. కానీ చంద్రబాబులాంటివాళ్లు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఏదైనా రాజకీయ పార్టీ అయిదేళ్లకో, మూడేళ్లకో ప్లీనరీ జరుపుకుని, ప్రజలకు అవసరమైన నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ ప్లీనరీ జరగకపోతే బాగుండు, వర్షం వస్తే బాగుండు, ఏదైనా విషాదం జరిగితే బాగుండు అని కోరుకునేవాళ్లని ఏమంటారు? అందుకే చంద్రబాబును సైకో పాత్ అంటాను అని రెచ్చిపోయారు.