అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని ఓ రెస్టారెంట్లో ముగ్గురు యువతులు రచ్చ చేశారు. సాస్ కోసం డబ్బులు అడిగారని రెచ్చిపోయారు. కుర్చీలు విసిరేసి, కౌంటర్ ఎక్కి వీరంగం సృష్టించారు. అందరూ చూస్తుండగానే నానా రభస చేశారు. జూలై 4న మాన్‌హట్టన్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లోని బెల్ ఫ్రైస్లో ఈ ఘటన జరిగింది. దీనిని ట్విట్టర్‌లోని లిబ్స్ ఆఫ్ టిక్‌టాక్ ఖాతాలో పోస్ట్ చేశారు. చివరికి ఆ యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.