సింహం గాండ్రిపు విన్నా చాలా మంది భయపడతారు. అలాంటిది ఓ మహిళ ఏకంగా రెండు సింహాలతో కలిసి వాకింగ్ చేసింది. పృథశెట్టి అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కర్రతో సింహాలను అదిలిస్తూ ఆమె నడుస్తున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. కాళికా దేవి వనవిహారం చేస్తోందని, అత్యంత ధైర్యవంతమైన మహిళ అని కామెంట్లు చేస్తున్నారు.